Advertisementt

స్టార్ హీరోలు చెయ్యలేని పని ఆమె చేసింది

Mon 19th Aug 2024 07:46 PM
stree 2  స్టార్ హీరోలు చెయ్యలేని పని ఆమె చేసింది
Stree 2 enters 200 cr club స్టార్ హీరోలు చెయ్యలేని పని ఆమె చేసింది
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరోస్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం పరితపిస్తున్నారు. ఈమద్యలో సౌత్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్ బాక్సాఫీసు మీద దండయాత్ర చెయ్యడం, అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలు విజయాలకు దూరమవడమనేది హిందీ ప్రముఖులను తట్టుకోలేకుండా చేస్తుంది. ఈ మధ్యలో షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ చిత్రాలతో బాలీవుడ్ కి విజయాలు కట్టబెట్టినా మిగతా హీరోలు డిజాస్టర్స్ ఇవ్వడం, నార్త్ ఆడియన్స్ సౌత్ మూవీస్ ని ఆదరించడం అన్ని చూస్తున్నాము. 

కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరోలు చెయ్యలేని పని అంటే రెండు రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టే స్టార్స్ ఇప్పుడు గమ్మున కూర్చోగా.. శ్రద్ద కపూర్ స్త్రీ 2 బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేస్తుంది. ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్త్రీ 2 నార్త్ లో మాత్రమే కాదు దక్షిణాది అందులోనూ తెలుగు తమిళ రాష్ట్రాల్లో సైతం హౌస్ ఫుల్ బోర్డులతో కలెక్షన్స్ పరంగా పరుగులు పెడుతుంది. 

ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి స్త్రీ 2 ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను దాటెయ్యడం చూసి బాలీవుడ్ జనాలే షాకవుతున్నారు. వీక్ డే సోమవారం కూడా స్త్రీ 2 థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీతో నడవడం చూస్తుంటే స్త్రీ 2 కలెక్షన్స్ వైజ్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది. స్త్రీ 2లో హారర్, కామెడీని రెండింటిని సమాంతరంగా బ్యాలన్స్ చేయడంతో ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. 

హిందీలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ దక్కినందుకు ట్రేడ్ మాత్రమే కాదు బాలీవుడ్ ప్రముఖులు సైతం సంతోషం వ్యక్తం చేస్తుంటే.. బాలీవుడ్ హీరోలు చెయ్యలేని పని శ్రద్ద కపూర్ చేసింది అంటూ చాలామంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Stree 2 enters 200 cr club:

Stree 2 Box Office Collection Report

Tags:   STREE 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ