Advertisementt

బిగ్ బాస్ ఎంట్రీపై అమృత ప్రణయ్ రియాక్షన్

Sat 24th Aug 2024 01:06 PM
amruta pranay  బిగ్ బాస్ ఎంట్రీపై అమృత ప్రణయ్ రియాక్షన్
Amruta Pranay on Bigg Boss entry బిగ్ బాస్ ఎంట్రీపై అమృత ప్రణయ్ రియాక్షన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 న్యూస్ మొదలైనప్పటి నుంచి అమృత ప్రణయ్ బిగ్ బాస్ 8 హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది అనే వార్త బాగా వైరల్ అయ్యింది. స్ప్రెడ్ అయిన ఫైనల్ లిస్ట్ లోను అమృత పేరు కనిపించడంతో ఆమెను అందరూ ఏంటి బిగ్ బాస్ కి వెళుతున్నావా అని అడుగుతున్నారట. అమృత ప్రణయ్ అంటే తెలియని వారుండరు. ప్రేమ వివాహం చేసుకుంది అని, గర్భవతి అని కూడా కనికరం చూపకుండా అమృత తండ్రి మారుతి రావు అమృత భర్త ప్రణయ్ ని చంపించడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.

ఆ తర్వాత అమృత ఫాదర్ మారుతి రావు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అలా అమృత ప్రణయ్ తన బిడ్డతో ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. సో అలాంటి అమ్మాయి హౌస్ లోకి వస్తుంది అనగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అమృత ప్రణయ్ తన బిగ్ బాస్ ఎంట్రీపై స్పందిందించింది. తాను బిగ్ బాస్ కి వెళుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

అందరూ నువ్వు బిగ్ బాస్ కి వెళుతున్నావటగా అని అడుగుతున్నారు. మా అమ్మ అయితే బిగ్ బాస్ కి వెళితే ముందే చెప్పు ప్రిపేర్ అవుతాను అని అడిగింది. నాకు ఎలాంటి బిగ్ బాస్ ఆఫర్ రాలేదు, నన్నెవరూ బిగ్ బాస్ కి రమ్మని అడగలేదు. కానీ నా పేరు ఎలా బయటికొచ్చిందో అనేది అర్ధం కావడం లేదు. ఇప్పటికైతే నేను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు.

ఫ్యూచర్ లో బిగ్ బాస్ కి రమ్మని ఆఫర్ వస్తే.. అప్పటిపరిస్థితులను బట్టి ఆలోచిస్తాను అంటూ అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది. 

Amruta Pranay on Bigg Boss entry:

Amruta Pranay reacts to her Bigg Boss entry News

Tags:   AMRUTA PRANAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ