Advertisementt

హరీష్ శంకర్ పై నిర్మాత హాట్ కామెంట్స్

Sat 24th Aug 2024 02:13 PM
vishwa prasad  హరీష్ శంకర్ పై నిర్మాత హాట్ కామెంట్స్
Producer Hot Comments on Harish Shankar హరీష్ శంకర్ పై నిర్మాత హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ కి చాలా యాటిట్యూడ్ ఉంటుంది. తనని ఎవరైనా కామెంట్ చేస్తే అస్సలూరుకోడు. వాళ్ళ తాట తీసేవరకు నిద్రపోడు. ఇది హరీష్ శంకర్ పై చాలామందికి ఉన్న అభిప్రాయం. తనని, తన సినిమాలను తక్కువచేసి చూస్తే వాళ్ళ భరతం పట్టె హరీష్ శంకర్ పై చాలామంది హీరోల అభిమానులు, మీడియా లో కొంతమంది గుర్రుగా ఉన్నారు. అయినా హరీష్ శంకర్ తగ్గడు.

ఈమధ్యన హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ కి వచ్చిన రిజల్ట్ తో నిర్మాతలు భారీగా నష్టపోయారు. రివ్యూవర్స్ మిస్టర్ బచ్చన్ కి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. ప్రేక్షకులు మిస్టర్ బచ్చన్ పై నెగెటివ్ గా కామెంట్ చేసారు. కొంతమంది హరీష్ శంకర్ పై ఉన్న కోపం మిస్టర్ బచ్చన్ పై చూపించడం వలన ఈ చిత్రం విపరీతమైన నెగెటివిటిని మూటగట్టుకుంది.

అయితే తాజాగా మిస్టర్ బచ్చన్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ హరీష్ శంకర్ పై హాట్ కామెంట్స్ చేసాడు. మేము చేసిన మిస్టర్ బచ్చన్ మ‌రీ అంత బ్యాడ్ గా ఏం లేదు, ఫ‌స్టాఫ్ బాగుంది, పాటలు కూడా న‌చ్చాయ‌ని, కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి పూర్తిగా ట్రాక్ తప్పింది, అంతేకాదు దానికి తోడు హ‌రీష్ శంక‌ర్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్ల వ‌ల్ల సినిమాకు మ‌రింత డామేజీ జ‌రిగింద‌ని ఆయన హరీష్ శంకర్ పై చేసిన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

అయితే సినిమాలో విష‌యం ఉంటే తాము పోరాడేవాళ్ల‌ము, కానీ ఇప్పుడు ఆ అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆయన తెగ ఫీలైపోతున్నారు. 

Producer Hot Comments on Harish Shankar:

Mr. Bachchan producer TG Vishwaprasad hot comments on Harish  Shankar

Tags:   VISHWA PRASAD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ