ఈ ఏడాది టాలీవుడ్ కి రెండు మూడు పెద్ద హిట్స్, రెండు మూడు మీడియం రేంజ్ హిట్స్ తప్ప పెద్దగా చెప్పుకునే విజయాలు దక్కలేదు. ఆడియన్స్ కూడా ఆయమన్న సినిమా లేక అల్లాడుతున్నారు, బోర్ కొట్టేస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. సమ్మర్ మొత్తం ఎన్నికల ఫీవర్ నడిచింది. తర్వాత కల్కి వచ్చింది. హిట్ అయ్యింది. ఈమద్యలో బోలేడన్ని సినిమాలొచ్చాయి, వెళ్లాయి.
అందులో ఇండియన్ 2 పూర్తిగా నిరపరచగా.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు బేర్ మనిపించాయి. ఆయ్ హిట్ అయినా అది చిన్న సినిమాగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు అంతా నాని చేతుల్లోనే ఉంది. రేపు శుక్రవారం సరిపోదా గురువారం అంటూ నాని అందరే ప్రమోషన్స్ తో బాగా ఇంట్రెస్టు కలిగించాడు.
సరిపోదా శనివారం ఎటు చూసినా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మరి నాని అయినా ఆడియన్స్ ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తాడో అనే ఆసక్తి, ఆత్రుత ట్రేడ్ లో ఉంది. పాన్ ఇండియా ఫిలిం గా రాబోతున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్. ఆయన విలనీ కేరెక్టర్ సినిమాలో చాలా క్యూరియాసిటీని కలిగిస్తుంది. నాని లుక్స్, సరిపోదా ట్రైలర్ అన్ని అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. చూద్దాం నాని ఏం చేస్తాడో అనేది.