హీరో నాని-వివేక్ ఆత్రేయ కలయికలో డీవివి దానయ్య నిర్మించిన సరిపోదా శనివారం చిత్రం నేడు మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని-వివేక్ ఆత్రేయ కలయికలో వచ్చిన అంటే సుందరాని కి సూపర్ హిట్ కాకపోయినా.. మంచి సినిమాగా ప్రేక్షకుల ప్రసంశలు అందుకోవడంతో.. ఇప్పుడు వచ్చిన సరిపోదా శనివారం పై క్రేజ్ ఏర్పడింది. నాని చేసిన ప్రమోషన్స్, ఎస్ జె సూర్య విలన్ గా కనిపించడం, ట్రైలర్ అన్ని సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాయి.
సరిపోదా శనివారం అంటూ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఇప్పటికే ఓవర్సీస్ లో షోస్ కంప్లీట్ చేసుకోవడంతో అక్కడ ఆడియన్స్ తమ స్పందనను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు. సరిపోదా.. ఓవర్సీస్ టాక్ లోకి వెళితే..
సరిపోదా శనివారం ఒక రెగ్యులర్, కమర్షియల్ ఫార్మాట్ మూవీ. ఫస్టాఫ్ అంత ఇంప్రెసివ్ గా లేదు. కొన్ని సీన్లు సాగదీసినట్టు ఉన్నాయి. యాక్షన్ పార్ట్, కాన్సెప్ట్ ఈ సినిమాకు పాజిటివ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్‌లో వచ్చే సబ్ సీన్ కేక పెట్టించాయి అని ఒక ఆడియెన్ కామెంట్ చేసాడు.
ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ అంత గొప్పగా లేదు రొటీన్ స్టోరీ, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ఓవరాల్‌గా ఎబౌ యావరేజ్ కమర్షియల్ డ్రామా అంటూ మరో ప్రేక్షకుడు కామెంట్ చేసాడు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్. నాని, ఎస్‌జే సూర్య పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, జేక్స్ బిజోయ్ బీజీఎం అదరగొట్టాడు కానీ రొటీన్ స్టోరీ, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ఓవరాల్‌గా ఎబౌ యావరేజ్ కమర్షియల్ డ్రామా అని మరికొందరు ప్రేక్షకులు కామెంట్ చేశారు.