Advertisementt

గేమ్ ఛేంజర్ తో పోటీ పడతారా?

Thu 29th Aug 2024 08:49 PM
vidudala 2  గేమ్ ఛేంజర్ తో పోటీ పడతారా?
Competing with a Game Changer? గేమ్ ఛేంజర్ తో పోటీ పడతారా?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. రేపో మాపో గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. గేమ్ ఛేంజర్ ని దిల్ రాజు చెప్పినట్టుగానే డిసెంబర్లో అంటే డిసెంబర్ 20 న విడుదల చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అది కన్ ఫర్మ్ గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 న ఉంటుంది, దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుంది. క్రిస్టమస్ హాలిడేస్ కలిసొస్తుంది అని ప్లాన్ చేసారు. అదే డిసెంబర్ 20 కి విజయ్ సేతుపతి-సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న విడుదల 2 విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. విడుదల పార్ట్ 1 తో వెట్రిమారన్ హిట్ అందుకున్నాడు. అది తెలుగులోనూ వర్కౌట్ అయ్యింది. 

ఇప్పుడు గేమ్ చెంజర్ డిసెంబర్ 20 అంటున్న సమయంలో సడన్ గా విజయ్ సేతుపతి విడుదల 2 డేట్ లాక్ చేసి వదలడం చూసిన మెగా ఫ్యాన్స్ ఏంటి గేమ్ ఛేంజర్ కే పోటీకి వెళుతున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Competing with a Game Changer?:

Game Changer vs Vidudala 2

Tags:   VIDUDALA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ