అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయకు నేచురల్ స్టార్ నాని మరో అవకాశం ఇచ్చాడు. దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ అంటే నాని కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సరిపోదా శనివారం నిన్న ఆగష్టు 29 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్ జె సూర్య విలన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈచిత్రానికి ప్రేక్షకులు యునామాస్ హిట్ ని కట్టబెట్టారు.
సోషల్ మీడియా టాక్, మౌత్ టాక్ సరిపోదా శనివారం కలెక్షన్స్ కు మరింత ప్లస్ అవడం పక్కాగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ధరకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది. సరిపోదా టైటిల్ కార్డు లోనే ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ ని రివెల్ చేసేసారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. సరిపోదా శనివారం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తరువాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా టాక్. ఈ లెక్కన సెప్టెంబర్ చివర్లో లేదంటే అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.