బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఈరోజు రాత్రి 7 నుంచి స్టార్ మా లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ 8 షూటింగ్ అప్పుడే ఆల్మోస్ట్ పూర్తి కావొస్తుంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా కాదు జంటలుగా హౌస్ లోకి అడుగుపెడుతూ కనిపించడం, నాగార్జున హోస్ట్‌గా గృహప్రవేశ ఆహ్వానమంటూ ప్రోమో కట్ చేసి వదిలారు.
మొదటిరోజు అంటే ఓపెనింగ్ రోజే నాని-ప్రియాంక మోహన్‌లు సరిపోదా శనివారం ప్రమోషన్స్ కి వచ్చేశారు. అందులో నానికి 100 అవుట్ ఆఫ్ 100 ఇస్తే ఎస్ జె సూర్యకి ప్రియాంక 101 ఇస్తాను అంటూ సరదాగా చెప్పింది. అలాగే 35 ప్రేమ కథలు నివేత థామస్ - రానా లు ప్రమోషన్స్ కోసం రాగా.. రానా-నివేత లను హౌస్ లోకి వెళ్ళమంటే నివేత నేను 3 డేస్ ఉంటాను, రానా 5 డేస్ ఉంటారు, అప్పుడు ఎలిమినేట్ చెయ్యండి, మా 35 ప్రేమ కథలకు సరిపోతుంది అంటూ ఫన్నీగా మాట్లాడింది.
ఇక బిగ్ బాస్ 8 మొదలైన ఎపిసోడ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ ట్విస్ట్ అంటూ మొదటిరోజే నేను ఒకరిని బయటికి తీసుకెళ్ళాలి, లక్కీ డ్రాలో వాళ్ళ ప్లేస్‌లో ఒకరు స్వాప్ అయ్యి వాళ్ళు లోపలకి వస్తారు.. అంటూ ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది.