రెండు తెలుగు రాష్ట్రాల్లో పడుతోన్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి.. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. మరీ ముఖ్యంగా విజయవాడ వరదలతో వణికిపోతోంది. మొత్తం విజయవాడ నీటితో జలమయమైనట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు తగిన చర్యలను తీసుకుంటూ.. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వరదలపై ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ.. తన అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను.. అని మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్‌కు అభిమానులు రియాక్ట్ అవుతూ... థ్యాంక్యూ బాస్.. తప్పకుండా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాస్ ఫర్ ఏ రీజన్ అంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్‌తో చిరు ట్వీట్ వైరల్ అవుతోంది.