Advertisementt

బిగ్ బాస్ 8: ఫస్ట్ నామినేషనే రచ్చ

Sat 14th Sep 2024 03:34 PM
bigg boss 8,first nomination  బిగ్ బాస్ 8: ఫస్ట్ నామినేషనే రచ్చ
Bigg Boss 8 Telugu First Nomination Sparks Drama బిగ్ బాస్ 8: ఫస్ట్ నామినేషనే రచ్చ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇంకా రెండు రోజులు కాలేదు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం హైలెట్ అయ్యేందుకు అప్పుడే రచ్చ స్టార్ట్ చేసేశారు. సీజన్ 8లోకి వచ్చింది మొత్తం స్టార్ మా సీరియల్స్ బ్యాచ్, సోషల్ మీడియాలో కాస్త పేరున్న వారంతా ఈ సీజన్‌లో కనిపిస్తున్నారు తప్ప సెలబ్రిటీస్ అన్న వారెవరూ ఈ సీజన్‌లోకి రాలేదు. పాత హీరో ఆదిత్య ఓం, విష్ణు ప్రియ తప్ప మిగతా వారంతా స్క్రాప్ బ్యాచ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. 

ఇక ఈ సీజన్ లోకి వచ్చినవారంతా పెద్ద ముదుర్లుగానే కనిపిస్తున్నారు. డే 1 నుంచే వాళ్ళంతా హైలెట్ అయ్యేందుకు పోటీపడిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు గొడవలు పెట్టుకునేందుకు సిద్ధంగా కనబడుతున్నారు. శేఖర్ భాష దగ్గర నుంచి బేబక్క వరకు ప్రతి ఒక్కరూ ఈ సీజన్‌లో తామే తోపులన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. 

ఇక ఈ సీజన్ మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్యన పెద్ద యుద్ధమే జరిగింది. ఆర్జీవీ బ్యూటీ సోనియా ఎక్కువగా హైలెట్ అయ్యేందుకు తెగ కష్టపడుతుంది. ప్రతి ఒక్కరుపై నోరు పారేసుకుంటుంది. ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ గొడవకు దిగిన ప్రోమోని వదిలారు. అది చూసిన బుల్లితెర ప్రేక్షకులు మొదటి నామినేషనే రచ్చ అయిందిగా అంటూ మాట్లాడుకుంటున్నారు.

Bigg Boss 8 Telugu First Nomination Sparks Drama:

First Nomination War at Bigg Boss House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ