ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ సరసన సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అనగానే ఎగిరి గంతేసిన మీనాక్షి చౌదరి.. గుంటూరు కారంలో ఆమె కేరెక్టర్ చూసాక ఈపాటి దానికి ఒప్పుకోకుండా ఉంటే సరిపోయేది, స్టార్ హీరో అనుకుంటే నిండా ముంచేశారు అనుకున్నారు. ఆతరవాత యంగ్ హీరోలతో పాటుగా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన ఛాన్స్ వచ్చింది అనగానే అబ్బో మీనాక్షి చౌదరి లక్కీ అంటూ మాట్లాడుకుంటున్నారు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన GOAT లో మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్.. అని అన్నమాటే కానీ సినిమా విడుదలయ్యాక కానీ ఆమె కేరెక్టర్ గురించిన క్లారిటీ రాలేదు. విజయ్ పక్కన ఆడి, పాడడానికేనా అన్నట్టుగా కుడా కాదు.. అసలు GOAT లో ఆమె కేరెక్టర్ కూరలో కర్వేపాకు మాదిరి తీసిపారేసాడు దర్శకుడు.
విజయ్ తో కాలు కదిపినా ఆ పాట పై విమర్శలు, సెకండ్ హాఫ్ లో మీనాక్షి ని చూసాక ఆమె అభిమానులు నీరు గారిపోయారు. స్టార్ హీరో సినిమా అనుకుంటే అంతలా మోసం చేస్తారా అంటూ మాట్లాడుకుంటున్నారు సినిమా జనాలు. మరి మీనాక్షి చౌదరికి స్టార్ హీరోల అవకాశాలు కలిసి రావడం లేదా, లేదంటే స్టార్ హీరో సరసన పేరు కనిపించినా చాలు అనుకుని ఒప్పుకుంటుందా అనేది మాత్రం ఆమె అభిమానులకు అర్ధం కావడం లేదు.