Advertisementt

తంగలాన్ ఓటీటీ డేట్ పై క్రేజీ న్యూస్

Sat 07th Sep 2024 01:37 PM
thangalaan  తంగలాన్ ఓటీటీ డేట్ పై క్రేజీ న్యూస్
Crazy news on Thangalaan OTT date తంగలాన్ ఓటీటీ డేట్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

చియాన్ విక్రమ్-పా.రంజిత్ కలయికలో ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తంగలాన్ చిత్రానికి తమిళ్ లో సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతేకాదు తెలుగులోనూ తంగలాన్ చిత్రానికి మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో ఆగష్టు 15 న విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు ప్రేక్షకులకు రుచించకపోవడం తంగలాన్ కి బాగా కలిసొచ్చింది.

ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌తో బంగారు నిక్షేపాల అన్వేషణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తంగలాన్ చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవడంతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తి మొదలైంది. కారణం ఈమధ్యన ఏ చిత్రమైనా అంటే బ్లాక్ బస్టర్ అయినా, లేదంటే డిసాస్టర్ అయినా నాలుగు వారాల గ్యాప్ లో ఓటీటీలోకి వచ్చేస్తూ ఉండడంతో తంగలాన్ ఓటీటీ పై కూడా అందరిలో ఆసక్తి నడుస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో గానీ లేదంటే అక్టోబర్ మొదటి వారంలో గాని తంగలాన్ ఓటీటీలో దర్శనం ఇవ్వనున్నది అని తెలుస్తోంది. 

Crazy news on Thangalaan OTT date:

Exciting news for Thangalaan OTT Release 

Tags:   THANGALAAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ