మహేష్ బాబు ఫ్యాన్స్ కి అడ్డంగా బుక్ అయ్యింది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్.. మహేష్ కూడా హెయిర్ ఊడిపోతే హెయిర్ ట్రాన్స్పలంటేషన్ చేయించుకున్నాడు.. అంటూ గీతూ రాయల్ బిగ్ బాస్ మణికంఠ విగ్ విషయంలో మహేష్ హెయిర్ ని కంపేర్ చేస్తూ చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించాయి.
బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టిన నాగమణికంఠ సింపతీ గేమ్ స్టార్ట్ చేసాడు. గత వారం నామినేషన్స్ టైమ్ లో తనని ఎక్కువమంది టార్గెట్ చెయ్యడం పై బోరున ఏడ్చేసిన మణికంఠ సోఫాలో పడుకుని తన తలకి ఉన్న విగ్ తీసేసాడు. అది చూసిన అందరూ ఓర్నీ నాగమణికంఠ ది విగ్గా అని ఆశ్చర్యపోయారు, షాకయ్యారు, మీమ్స్ చేసారు.
అయితే బిగ్ బాస్ 8 రివ్యూస్ చెప్పే గీతూ రాయల్ అదేమిటండి నాగ మణికంఠ విగ్ పెట్టుకోవడంలో తప్పేముంది, సూపర్ స్టార్ మహేష్ కూడా జుట్టు ఊడిపోతే హెయిర్ ట్రాన్స్పలంటేషన్ చేయించుకున్నారు, అంటూ విగ్ పెట్టుకోవడంలో తప్పు లేదు అని చెప్పే క్రమంలో మహేష్ హెయిర్ ని నాగమణికంఠ హెయిర్ తో కంపేర్ చేస్తూ చేసిన కామెంట్స్ కి మహెష్ ఫ్యాన్స్ కి పిచ్చ కోపమొచ్చేసింది. దానితో గీతూ రాయల్ ని టార్గెట్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టేసారు.