కోలీవుడ్ హీరో జీవా అతని ఫ్యామిలీ తృటిలో పెను ప్రమాదం నుంచి బయట పడిన ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. జీవా ఆయన ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారు ఓ బైకర్ ని తప్పించబోయి ఎదురుగా ఉన్న బారిగేడ్ ను గుద్దేసి కారు నుజ్జు నుజ్జయ్యింది.
చెన్నై నుంచి సేలం వెళుతున్న జీవా కారు కన్నమయూరి దగ్గర బైక్ ని తప్పించబోయి ఎదురుగా ఉన్న బారిగేడ్ ని ఢీ కొట్టడంతో కారు కు భారీగా డ్యామేజ్ అయ్యింది. అదే సమయంలో కారులో జీవా తో పాటుగా అతని ఫ్యామిలీ కూడా ఉంది. జీవాకి కానీ, ఆయన ఫ్యామిలీ కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
జీవా కారు ప్రమాదానికి గురైన విషయం, కారు ఉన్న పొజిషన్ చూసి ఆయన అభిమానులు ఆందోళన పడినప్పటికి జీవాకి, ఆయన ఫ్యామిలీకి ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఊపిరి పీలుసుకుంటున్నారు అభిమానులు.