Advertisementt

SSMB 29 : ఇంత సీక్రెటా

Thu 12th Sep 2024 10:32 AM
ssmb 29  SSMB 29 : ఇంత సీక్రెటా
SSMB 29 : So secret SSMB 29 : ఇంత సీక్రెటా
Advertisement
Ads by CJ

 

మహేష్ బాబు-రాజమౌళి సినిమా అనౌన్సమెంట్ నుంచే ఆ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. SSMB 29 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా, దానిపై రాజమౌళి ఎప్పుడు అప్ డేట్ ఇస్తారా అని మహేష్ అభిమానులే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మధ్య మధ్యలో విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన అప్ డేట్స్ తప్ప రాజమౌళి ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు.

మహేష్ బర్త్ డే కి SSMB 29 పై అప్ డేట్ వస్తుంది అనుకుని మహేష్ అభిమానులు డిజ్ పాయింట్ అయ్యారు. సెప్టెంబర్ లో రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పై ఖచ్చితంగా అనౌన్సమెంట్ ఉంటుంది. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉన్నారని అంటున్నా సెప్టెంబర్ వచ్చి అప్పుడే సగం నెల పూర్తయ్యింది. కానీ ఎలాంటి చిన్న క్లూ కూడా బయటికి రాకుండా చాలా సీక్రెట్ ని రాజమౌళి కాంపౌండ్ మైంటైన్ చేస్తుంది.

చిన్న విషయం కూడా బయటకి రానివ్వడం లేదు. ఆఖరికి మత్తువదలరా 2 ప్రమోషన్స్ లో భాగంగా సింహ కోడూరి రాజమౌళి SSMB 29 అప్ డేట్ అడగ్గానే రాజమౌళి అప్ డేట్ కావాలా అంటూ కర్ర తీసుకున్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక త్వరలోనే రాజమౌళి-మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్ పై ఓ కాన్సెప్ట్ వీడియోతో క్లారిటీ ఇవ్వబోతున్నారనేది మాత్రం తెలుస్తుంది.  

SSMB 29 : So secret:

SSMB 29 update

Tags:   SSMB 29
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ