హీరో నాని రీసెంట్ చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రం ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ సంపాదించింది. నాని, విలన్ కేరెక్టర్ ఎస్ జె సూర్య పెరఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ మేకింగ్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సరిపోదా శనివారం విడుదలైన రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు, వరదలు వలన జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది కానీ లేదంటే సరిపోదా శనివారానికి రికార్డ్ కలెక్షన్స్ వచ్చేయి.
అయినప్పటికి సినిమా విడుదలైన 17 రోజుల్లోనే నాని 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించారు. దసరా తర్వాత నాని కి సరిపోదా శనివారమే 100 కోట్లు తెచ్చిపెట్టిన సినిమా. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం ఓటీటీ డేట్ పై కనిపించిన న్యూస్ చూస్తే 100 కోట్లు సరిపోతాయా నాని అంటారేమో..
గతంలో నాని నటించిన దసరా హిట్ అయినా.. ఆ చిత్రం థియేటర్స్ లో విడుదలైన నెలకే ఓటీటీలో ప్రత్యక్షమవగా.. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా సెప్టెంబర్ 26 నుంచి పాన్ ఇండియా భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఆగష్టు 29 న థియేటర్స్ లోకి వచ్చిన సరిపోదా నెల తిరక్కుండానే ఓటీటీలోకి రాబోతోందా.. అనేది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.