లేడీ కొరియోగ్రాఫర్ ని అత్యాచారం చేసి, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమంటూ వేధించిన కేసులో ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ ను నిన్న గోవా పోలీసులు అరెస్ట్ చేసారు. రెండుమూడు రోజులు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్న జానీ ను నిన్న SOT పోలీసులు అరెస్ట్ చేసి గోవా కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈరోజు ఉదయం జానీ కి వైద్యపరీక్షల అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టగా జానీ మాస్టర్ కు ఉప్పర్ పల్లి కోర్టు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. ఆ వెంటనే జానీ మాస్టర్ ను పోలీసులు చెంచల్ గూడా జైలుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు తమ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు.
వారం రోజుల పాటు జానీ మాస్టర్ ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా జెడ్జ్ ను పోలీసులు కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే జాని మాస్టర్ భార్య అయేషా ఇదంతా ఫేక్ కేస్, పొలిటికల్ గా, కెరీర్ పరంగా జానీ మాస్టర్ ను తొక్కేసే క్రమంలో పెట్టిన కేసు అంటూ ఆమె వాదిస్తుంది.