బిగ్ బాస్ సీజన్ 8 మూడు వారాలు పూర్తి చేసుకుంది, 14 మంది కంటెస్టెంట్స్ లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యి హౌస్ ను వీడారు. మొదటి వారం కిచెన్ వలన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది, రెండో వారం కొడుకు పుట్టిన కారణంగా బాబు ని చూడాలని శేఖర్ భాషాను హౌస్ మేట్స్ బయటికి పంపించారు.
ఇక మూడో వారం ఎనిమిదిమంది నామినేషన్ లో ఉంటే ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన అభయ్ ఎలిమినేట్ అవడం ఎవరికి పెద్ద షాకింగ్ అనిపించలేదు. గత రెండు వారాల ఆట ఎలా ఉన్నా క్లాన్ చీఫ్ అయ్యాక అభయ్ ఆట కన్నా ఎక్కువగా బిగ్ బాస్ ని టార్గెట్ చేస్తూ తిట్టిన విషయం, గేమ్ పై ఫోకస్ పెట్టకుండా చతికిల పడిన విషయంలో ఆడియన్స్ అభయ్ ని డేంజర్ జోన్ లో ఉంచారు.
శనివారం ఎపిసోడ్లో బిగ్ బాస్ ని తిట్టడంపై నాగార్జున ఫుల్ క్లాస్ పీకడమే కాదు అభయ్ ని హౌస్ నుంచి వెళ్ళమన్నారు. రెడ్ కార్డు ఇచ్చారు. ఫైనల్ గా ఆదివారం అభయ్ అఫీషియల్ గా ఎలిమినేట్ అయినట్లుగా లీకులు వచ్చేసాయి. ఈ వారం అభయ్ ఎలిమినేట్ అయ్యి మూడో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చేసాడు.