జానీ మాస్టర్ మళ్ళీ జైలు పాలయ్యారు. లేడీ కొరియోగ్రాఫర్ ను మోసం చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ తనకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అవార్డు అందుకోవడానికి గాను తనకు బైలు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరగా... కోర్టు ఈ నెల 10 వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ నెల 8న ఢిల్లీ లో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో జానీ మాస్టర్ ఆ అవార్డు అందుకోవాల్సి ఉండగా.. జానీ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు కావడంతో అవార్డుల కమిటీ జానీ మాస్టర్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా వచ్చిన అవార్డును రద్దు చేసింది. దానితో జానీ మాస్టర్ బెయిల్ కూడా రద్దయ్యింది.
జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అవార్డు అందుకోవడానికి జానీ మాస్టర్ కు బెయిల్ లభించగా.. ఇప్పుడు అవార్డు రద్దు కావడంతో ఆయనకు బెయిల్ కూడా రద్దయ్యింది. దానితో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరోసారి జైలుకు తరలించారు.