సూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబచ్చన్, రానా, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రం వేట్టయ్యన్. జై భీం దర్శకుడు టీజె జ్ఞానవేల్ తెరకెక్కించిన వేట్టయ్యన్ నిన్న అక్టోబర్ 10 న తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగు లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలయ్యింది. తమిళనాట గ్రాండ్ గా ఆడియో వేడుక కార్యక్రమాన్ని చేసుకుంది.
అయితే ఈ చిత్రానికి తెలుగు, తమిళ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వేట్టయన్ రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాకపోయినా సూపర్ స్టార్ రజినీకాంత్ కుండే క్రేజ్ వలన దర్శకుడు కూడా కమర్షియల్ ఎలివేషన్స్ వైపుకు వెళ్ళిపోయాడు. మాస్, మెసేజ్ రెండిటిని సమానంగా చూపించే క్రమంలో సెకండ్ హాఫ్ లో దర్శకుడు తప్పిదాలు స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తాయి.
అమితాబ్, రానా, ఫహద్ ఫాసిల్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను వేట్టయ్యన్ అంతగా ఇంప్రెస్ చెయ్యలేదనే కామెంట్స్ బాగా వినిపించాయి. మరి ఈ దసరా హాలిడేస్ ఏమైనా రజినీకాంత్ వేట్టయ్యన్ ను ఆదుకుంటాయా అనే విషయంలో డౌట్ ఉంది. కారణం దసరా బరిలో తెలుగు నుంచే నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అటు తమిళనాట మాత్రం వేట్టయ్యన్ ని తమిళ తంబీలు సూపర్ హిట్ చెయ్యడం ఖాయమనే మాట వినిపిస్తోంది.