Advertisementt

సౌభాగ్యాల, శ్రీనిధులతో ‘దుర్గే ప్రసీద’ అంటోన్న ప్రముఖ రచయిత పురాణపండ

Sat 12th Oct 2024 05:55 PM
puranapanda srinivas,books,deveem smaraami  సౌభాగ్యాల, శ్రీనిధులతో ‘దుర్గే ప్రసీద’ అంటోన్న ప్రముఖ రచయిత పురాణపండ
Puranapanda Srinivas Deveem Smaraami Book To Great Priests సౌభాగ్యాల, శ్రీనిధులతో ‘దుర్గే ప్రసీద’ అంటోన్న ప్రముఖ రచయిత పురాణపండ
Advertisement
Ads by CJ

విజయవాడ, అక్టోబర్ 10: తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణ కుంకుమార్చనల్లో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలైన ‘దుర్గే ప్రసీద, దేవీం స్మరామి, సౌభాగ్య, శ్రీనిధి’ గ్రంధాలు ఈ సంవత్సరం శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయనేది మన కన్నులముందు కనిపించిన పరవశపు సత్యం.

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మంత్రమయ స్తోత్ర వ్యాఖ్యాన గ్రంధం భక్తకోటికి కుంకుమార్చన ద్వారా, లడ్డూ కౌంటర్ల ద్వారా, ఆవిష్కరణోత్సవాల ద్వారా అమ్మవారి  అనుగ్రహంగా భక్త కోటికి చేరడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవని శ్రీ దుర్గామల్లేస్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే.ఎస్.రామారావు సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ప్రధానంగా దుర్గాష్టమి పర్వదిన సాయంకాలవేళలో విజయవాడ ఇంద్రకీలాద్రి వేదఘోషతో మారుమ్రోగింది. ఈ ప్రపంచాన్ని సమృద్ధం చేసే అక్షయ ధైర్యాల వేదఘోష వందమందికి పైగా వేదపండితుల ఉదాత్త అనుదాత్త స్వరాలతో అమ్మవారికి నీరాజనంగా సమర్పించబడటం గురువారం రోజు వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది. ఈ అద్భుత వైదిక కార్యానికి భారతదేశ నలుమూల నుండీ హాజరైన పండితులకు ఆలయ సిబ్బంది, ఆలయ ఉత్సవ కమిటీ వేద పండితులకు నగదు సత్కారంతోపాటు ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప లావణ్యాల పవిత్ర ‘దేవీం స్మరామి’ గ్రంధాన్ని వందకు పైగా హాజరైన ఘానపాఠీ లకు, వేద పండిత బృందాలకు బహూకరించడం అందరినీ తన్మయింప చేసింది.

వేదపఠనం సమయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి, కమీషనర్ జె. సత్యనారాయణ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కే.ఎస్. రామారావు తదితర ప్రముఖులు హాజరై వేదఘోషను విని వందలమంది పండిత బృందాలకు అభివాదాలకర్పించారు.

ఈ అపురూప మంత్ర పేటికను మాకు అమ్మ దుర్గమ్మ అనుగ్రహంగా దేవస్థానంలో ఈ వేదఘోషలమధ్య మంత్ర ప్రసాదంగా ఆనం రామనారాయణరెడ్డి ప్రోత్సాహంతో ఈ ఓ రామారావు బహూకరింపచేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వేదపండిత బృందం ముక్త కంఠంతో ప్రశంసించడం ఈ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకతగానే చెప్పాలి. రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో దశాబ్దాలుగా జరుగుతున్న మహోన్నతమైన దేవీ ఉత్సవాల్లో ఈ సంవత్సరం పురాణపండ ‘సౌభాగ్య’ గ్రంధం ప్రధానంగా ఆకర్షించింది. 

Puranapanda Srinivas Deveem Smaraami Book To Great Priests:

Puranapanda Srinivas Books Hulchal in Navratri Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ