Advertisementt

ఆ థియేటర్లో తొలి, చివరి చిత్రం రజినీదే!

Sun 13th Oct 2024 09:40 PM
udhayam theatres,rajinikanth  ఆ థియేటర్లో తొలి, చివరి చిత్రం రజినీదే!
Udhayam Theatres First and Last Film Hero Rajinikanth ఆ థియేటర్లో తొలి, చివరి చిత్రం రజినీదే!
Advertisement
Ads by CJ

మనషులే కాదు, థియేటర్లు కూడా ఓల్డ్ అయిపోతాయి. మూతపడతాయి. మనుషులు భూమి లేకుండా పోయినట్లే.. సినిమా థియేటర్లు కూడా ఓల్డ్‌వి కనుమరుగవుతున్నాయి. మరణం మళ్లీ జననానికే అన్నట్లుగా.. మూత పడిన థియేటర్ల స్థానంలో ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక విషయంలోకి వస్తే.. ఆ థియేటర్ కాంప్లెక్స్ తమిళనాడులో చాలా చాలా ఫేమస్. కానీ ఇప్పడది శాశ్వతంగా మూత పడబోతోంది. 

చెన్నైలో ఉన్న పాత, ఫేమస్ థియేటర్లలో ఉదయం సినిమాస్ ఒకటి. ఇప్పుడీ ఉదయం థియేటర్ శాశ్వతంగా కనుమరుగు కాబోతోంది. 1983లో ప్రారంభమైన ఈ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉదయం, సూరియన్, చందిరన్ అనే పేర్లతో మూడు స్క్రీన్లు ఉన్నాయి. దాదాపు 41 ఏళ్లుగా ప్రేక్షకులని అలరించి, ప్రతి ప్రేక్షకుడితో ఎంతో కనెక్షన్ పొందిన ఈ కాంప్లెక్స్‌.. ఇకపై కనిపించకుండా పోతుందంటే చింతించాల్సిన విషయమే. 

కారణం ఏంటనేది పక్కన పెడితే.. ఈ కాంప్లెక్స్‌తో కనెక్షన్ ఉన్నవారు బాధపడక తప్పదు. వాస్తవానికి ఎప్పుడో ఈ కాంప్లెక్స్‌ని కూల్చేసి లగ్జరీ అపార్ట్‌మెంట్ కట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ క్రయ విక్రయాలలో జాప్యం కారణంగా ఇప్పుడీ కాంప్లెక్స్‌లో రజినీకాంత్ వేట్టయన్ సినిమా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా రన్ అయిన రోజులు ఆడించి ఆ తర్వాత కూల్చేస్తారనేలా వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే.. ఈ థియేటర్లలో మొదట ప్రదర్శించిన చిత్రం రజినీకాంత్ నటించినదే కావడం. శివప్పు సూరియన్‌ సినిమాతో మొదలైన ఉదయం ప్రస్థానం వేట్టయన్‌తో ముగుస్తోంది.

Udhayam Theatres First and Last Film Hero Rajinikanth:

Udhayam Theatres Collapsed Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ