ఎన్నో ఏళ్ళ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో హిట్ కొట్టారు. తంగలాన్ తో విక్రమ్ కమ్ బ్యాక్ అయ్యారు. పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ చిత్రం ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున విడుదలయ్యింది. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషలన్నిటిలో హిట్ అయ్యింది.
దానితో తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అయితే థియేటర్స్ లో విడుదలైన నెలకే తంగలాన్ ఓటీటీ లో ఉంటుంది అనుకుంటే ఇప్పటివరకు తంగలాన్ ఓటీటీ జాడ లేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం తంగలాన్ ఓటీటీ రిలీజ్ కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని సమాచారం, ఈ సినిమాను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ వారు దీపావళి కానుకగా ఈ నెల 31వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సో ఫైనల్లీ విక్రమ్ హిట్ మూవీ ఓటీటీ కి రాబోతుందన్నమాట.