Advertisementt

మాజీ భార్య పై నోయెల్ సెన్సేషనల్ కామెంట్స్

Sat 19th Oct 2024 10:16 AM
noel sean  మాజీ భార్య పై నోయెల్ సెన్సేషనల్ కామెంట్స్
Noel sensational comments on ex-wife Esther మాజీ భార్య పై నోయెల్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

నోయల్-ఎస్తర్ ఇద్దరూ కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న కొద్ధి రోజులకే విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎస్తర్ కెరీర్ లో పలు అవకాశాలతో ముందుకెళ్ళిపోయింది. కానీ నోయెల్ బిగ్ బాస్ ఆఫర్ అందుకుని మధ్యలోనే అనారోగ్యంతో బయటికొచ్చేసాడు. 

ఆతర్వాత నోయెల్ చాలా అరుదుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఎస్తర్ మాత్రం చాలా ఇంటర్వూస్ లో నోయెల్ తనని టార్చెర్ చేసాడు, తనని ఇబ్బంది పెట్టడంతోనే తాను విడాకులు తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చింది. కానీ నోయెల్ మాత్రం ఇప్పటి వరకు ఎస్తర్ విషయంలో ఎక్కడా నెగెటివ్ గా చెప్పలేదు. 

తాజాగా నోయెల్ మాజీ భార్య ఎస్తర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ మామధ్యన గొడవలు జరిగినా అమ్మా నాన్నకు వినిపించకుండా పైన గొడవ పడేవాళ్ళం. ఇద్దరికి కుదరక విడాకులు తీసుకున్నాము, నా గురించి ఆమె చెడుగా చెప్పగానే.. నాతో ఉన్న వాళ్లు నాకు దూరం అయ్యారు, నేను ఒప్పుకున్న సినిమా ఆఫర్స్ కూడా చేజారిపోయాయి . 

ఆ తర్వాతే నాకు జీవితం అంటే ఏంటో అర్ధమైంది, నేను ఆమెను టార్చర్ చేశానని చెప్పింది. కానీ మా జర్నీ చాలా అందంగా ఉండేది అని నేను అంటాను. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే, వాళ్లను మనం ఏమీ అనలేము.. నేనూ అంతే. నాపై తనకి ప్రేమ లేకపోవచ్చు.. కానీ నాకు ప్రేమ ఉంది.. అంటూ నోయెల్ తన మాజీ భార్యపై ప్రేమను చూపించాడు. 

Noel sensational comments on ex-wife Esther:

Actor Noel Sean About His Divorce

Tags:   NOEL SEAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ