కాంతార తో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార కు ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. హీరోగా, దర్శకుడిగా రిషబ్ కాంతర ప్రీక్వెల్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. కన్నడ నుంచి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన రిషబ్ శెట్టి ఇపుడు తెలుగు వైపు టర్న్ అయ్యారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కి సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ లో హనుమంతుడి పాత్ర కోసం రిషబ్ శెట్టి ఏకంగా 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈలోపు రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు.
అది టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ లో రిషబ్ శెట్టి నటించేందుకు చర్చలు జరుగుతున్నాయట. అయితే సితార-రిషబ్ కాంబో చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కాంతార హిట్ తర్వాత రిషబ్ శెట్టి కి పలు భాషల నుంచి అవకాశాలు వస్తున్నా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఇలా తెలుగులో ఆయనకు రెండు ప్రాజెక్ట్స్ నచ్చి ఆ రెండిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.