Advertisementt

క్రేజీ డీల్‌తో రాజా సాబ్ ఆడియో రైట్స్

Tue 22nd Oct 2024 09:52 PM
the raja saab,prabhas,maruthi  క్రేజీ డీల్‌తో రాజా సాబ్ ఆడియో రైట్స్
The Raja Saab audio rights fetch fancy sum క్రేజీ డీల్‌తో రాజా సాబ్ ఆడియో రైట్స్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ మూవీ పై ట్రేడ్‌లో చాలా క్రేజ్ ఉంది. రాజా సాబ్ ఫస్ట్ లుక్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంప్రెస్ అయ్యారు. మరికొన్ని గంటల్లో అంటే ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా రాజా సాబ్ నుంచి ప్రభాస్ గ్లింప్స్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరో వైపు రాజా సాబ్ బిజినెస్ క్రేజీ డీల్స్‌తో మొదలైపోయింది. 

థమన్ మ్యూజిక్ అందిస్తున్న రాజా సాబ్ ఆడియో హ‌క్కుల్ని టీ సిరీస్ ఫ్యాన్సీ డీల్‌తో రూ. 25 కోట్ల‌కు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ప్రభాస్‌ని మారుతి లవర్ బాయ్‌లా కొత్తగా చూపించబోతున్నాడు. ప్రభాస్ రాజా సాబ్ స్టైలిష్ లుక్ పై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ‌గా ఉన్నారు. మాస్ చిత్రాల మధ్యన రాజా సాబ్ క్లాస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

హార‌ర్‌, కామెడీ జోన‌ర్లో సాగే ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ క్లాసిక్ పాట‌ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సిద్ధి ఇద్నాని హీరోయిన్స్‌గా ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా హారర్ థ్రిల్లర్‌గా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రాబోతోంది.

The Raja Saab audio rights fetch fancy sum:

The Raja Saab audio rights acquired

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ