Advertisementt

జై హనుమాన్ అప్డేట్‌కు ఇదే సైన్

Thu 24th Oct 2024 05:00 PM
jai hanuman,prashanth varma,pvcu  జై హనుమాన్ అప్డేట్‌కు ఇదే సైన్
Jai Hanuman Update on Diwali జై హనుమాన్ అప్డేట్‌కు ఇదే సైన్
Advertisement
Ads by CJ

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన హనుమాన్ మూవీ ఎలాంటి విజయం సాధించిందో.. ఆ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న జై హనుమాన్‌పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రీసెంట్‌గా ఈ సినిమాలో హనుమాన్‌గా కాంతార హీరో రిషభ్ శెట్టి నటిస్తున్నాడంటూ వార్తలు రాగానే.. ఒక్కసారిగా జై హనుమాన్ మళ్లీ వార్తలలోకి వచ్చింది. అయితే చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ప్రశాంత్ వర్మ నుండి జైహనుమాన్‌కు సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లుగా ఓ సైన్ అయితే వచ్చేసింది. 

హనుమాన్‌ సినిమా విడుదల రోజు ప్రశాంత్ వర్మ ఆఫీస్ పైకి ఓ వానరం వచ్చిన విషయం తెలిసిందే. అది చూసిన వారంతా హనుమాన్ సినిమాకు ఆ హనుమంతుడి ఆశీస్సులు లభించినట్లుగా భావించారు. ఇప్పుడు మరోసారి అలాంటి సైనే ప్రశాంత్ వర్మ నుండి వచ్చింది. మేము మరోసారి కలిశాము.. మరియు ఇదొక సైన్ అని అనుకోవచ్చు అంటూ వానరంతో ఉన్న ఫొటోలను ప్రశాంత్ వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇంకో విషయం కూడా ఆయన ఈ ట్వీట్‌లో రివీల్ చేశారు. 

ఈ దీపావళికి జైహనుమాన్ అప్డేట్ ఉండబోతున్నట్లుగా దివాళి ఈజ్ కమింగ్ అంటూ ఓ ట్యాగ్ కూడా చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతోన్న జై హనుమాన్ చిత్రం కోసం అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో దేవుళ్ల పాత్రలలో ఎవరు నటించబోతున్నారనే క్యూరియాసిటీ ఇప్పుడందరిలో ఉంది. ఆ క్యూరియాసిటీని మరింత పెంచేలా.. ఈ దీవాళికి ప్రశాంత్ వర్మ ఏ అప్డేట్ ఇవ్వబోతున్నారో చూద్దాం మరి. 

Jai Hanuman Update on Diwali:

Jai Hanuman Updage From Prashanth Varma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ