లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొన్నాళ్లుగా చంచల్ గూడ జైలులో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా హైకోర్టు రెగ్యూలర్ బెయిల్‌ను మంజూరు చేసింది. తన దగ్గర అసిస్టెంట్‌గా చేసిన లేడీ కొరియోగ్రాఫర్‌ను జానీ మాస్టర్ లైంగికంగా వేధించినట్లుగా.. సదరు లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. దీంతో విచారణ అనంతరం జానీ మాస్టర్‌ను చంచల్ గూడ జైలుకి తరలించారు. రెండు వారాలుగా జానీ మాస్టర్ ఆ జైలులోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు బెయిల్ రావడంతో.. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు కారణంగానే జానీ మాస్టర్ నేషనల్ అవార్డును మిస్సయిన విషయం తెలిసిందే. తమిళ్‌లో ఆయన కంపోజ్ చేసిన ఓ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఆయన నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. కానీ పోక్సో యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు కావడంతో అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్లుగా అవార్డ్ కమిటీ ఇటీవల ప్రకటించింది. దీంతో ఈ అవార్డు అందుకునేందుకు తీసుకున్న బెయిల్‌ని కూడా జానీ మాస్టర్ క్యాన్సిల్ చేసుకున్నారు.
మరోవైపు జానీ భార్య.. ఆయనని బయటికి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఎలాంటి వారో తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు. అలాగే డ్యాన్సర్స్ యూనియన్ తరపు నుండి కూడా ఇటీవల జానీ మాస్టర్‌కు సపోర్ట్ లభించింది. అనీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి వారు జానీ మాస్టర్ అలాంటివారు కాదంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. మొదటి నుంచి ఈ కేసుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. జానీ మాస్టర్‌పై కావాలనే కేసు పెట్టించారనేలా కూడా టాక్ నడిచింది. ఇక ఎట్టకేలకు జానీ మాస్టర్‌కు బెయిల్ లభించడంతో.. ఆయనని అభిమానించే వారు కూడా హ్యాపీగా ఉన్నారు.