రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్‌గా వచ్చిన ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో ఈ మోషన్ పోస్టర్ 8.3 మిలియన్ వ్యూస్ రాబట్టి.. సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. 24 గంటల తర్వాత కూడా ఈ మోషన్ పోస్టర్ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి హర్రర్ జానర్‌లో నటిస్తోన్న ఈ రాజా సాబ్‌పై మోషన్ పోస్టర్ భారీగా అంచనాలను పెంచేసింది. కాకపోతే అక్కడక్కడా ట్రోలింగ్ కూడా మొదలైందనుకోండి. అయినా సరే.. ప్రభాస్ మేకోవర్ ఈ సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. అసలు మారుతి, ప్రభాస్‌తో ఏం చేయిస్తున్నాడో అనే క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఇకపై రాబోయే అప్డేట్స్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం.
ప్రభాస్‌కి రికార్డులేం కొత్తకాదు. టాలీవుడ్‌లో చాలా రికార్డులు ఆయన పేరు మీదే ఉన్నాయి. కలెక్షన్ల పరంగానూ ప్రభాస్ టాప్‌లోనే ఉన్నారు. ఇప్పుడీ రాజా సాబ్ మోషన్ పోస్టర్.. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది అంతే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.