నందమూరి నటసింహా బాలకృష్ణ-బోయపాటి కాంబో హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆ కాంబో నుంచి రాబోతున్న అఖండ తాండవం చిత్రం పై అంచనాలు ఎంతెలా ఉంటాయో అనేది చెప్పడం కూడా కష్టమే. రీసెంట్ గానే మొదలైన అఖండ తాండవం మూవీ రెగ్యులర్ షూట్ మాత్రం బాలయ్య NBK 109 షూటింగ్ పూర్తయ్యాకే ఉండబోతుంది.
అఖండ కు సీక్వెల్ గా రాబోతున్న అఖండ తాండవం మూవీ స్టోరీ పై ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అఖండ మూవీలో సన్యాసుల్లో కలిసిపోయిన అఖండ కేరెక్టర్ చిన్న బాలకృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతూ.. మళ్లి బంధాలకు, అనుబంధాలకు దూరమైపోయినట్లుగా ఎండ్ చేశారు.
అఖండ 2 స్టోరీ యూఎస్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుందని, ప్రగ్యా జైస్వాల్ పాత్ర హెల్త్ ట్రీట్మెంట్ కోసం రెండో బాలయ్య పాత్ర యూఎస్ వెళ్లాల్సి వస్తోందని, యుఎస్ లో తెలుగు వాళ్ళ పై ఎటాక్ జరిగే క్రమంలో బాలయ్య పాత్ర వారిని సేవ్ చేస్తోందని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ తోనే అఖండ 2 మొదలవుతుందని అంటున్నారు.
మరి అఖండ 2 లో బాలయ్య ను ఇంకెంత పవర్ ఫుల్ గా బోయపాటి చూపిస్తారో అని నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.