శోభిత దూళిపాళ్ల అతి త్వరలోనే అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతుంది. ఆగష్టు 8 న నాగ చైతన్యతో నిశ్చితార్ధం చేసుకున్న శోభిత దూళిపాళ్ల నాగార్జున కోడలిగా అఫీషియల్ పోస్ట్ లోకి వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవడంతో అక్కినేని ఇంట కాలు పెట్టలేదు. కానీ ఇప్పుడు అధికారికంగా అక్కినేని కోడలిగా శోభిత దూళిపాళ్ల అందరికి పరిచయమైంది.
ఈరోజు ANR అవార్డు వేడుకలో అక్కినేని ఫ్యామిలీతో నాగ చైతన్య పక్కనే ఉండి శోభిత సందడి చేసింది. దానితో అందరూ ఇంకా పెళ్లి కాకుండానే శోభిత అఫీషియల్ గా నాగ్ కోడలిగా మొదటిసారి చైతూతో కలిసి పబ్లిక్ ఈవెంట్ లోకి వచ్చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు. అమితాబచ్చన్ అతిధిగా మెగాస్టార్ చిరుకు ANR అవార్డు ని అక్కినేని ఫ్యామిలీ అందజేసింది.
ఈ వేడుకలో వెంకటేష్, యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ హాజరైనా అందరి కళ్ళు అక్కినేని కొత్త కోడలు శోభిత పైనే ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫోటో లో నాగ చైతన్య పక్కనే శోభిత దూళిపాళ్ల నించునిఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.