డిసెంబర్ లో నాగ ఛైతన్య-చందు మొండేటి తండేల్ విడుదల ఉంటుంది అనే ప్రచారం ఇప్పటిది కాదు, ఈమద్యలో నాగ చైతన్య తండేల్ కూడా సంక్రాంతి బరిలో దిగబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు కానీ అరవింద్ తన మేనల్లుడు చరణ్ సినిమాకు ఎదురెళ్తారా, వెంకీ మామ సినిమాతో చైతు తలపడతాడా అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
తాజాగా తండేల్ దర్శకుడు చందు మొండేటి ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా వస్తుంది అని అరవింద్ గారు తండేల్ సంక్రాంతి రిలీజ్ గురించి ఆలోచిస్తే, అదే తన మావయ్య వెంకటేష్ గారి సినిమా వస్తుంది అని నాగ చైతన్య ఆలోచిస్తే సంక్రాంతికి తండేల్ రాకపోవచ్చు అంటూ తన సినిమా సంక్రాంతికి అనుకుంటున్నా ఇన్ని చిక్కుముడులు ఉన్నాయంటూ చందు మొండేటి ఓపెన్ గానే మాట్లాడాడు.
అలా ఆలోచిస్తే తండేల్ సంక్రాంతి నుంచి పుష్ అయ్యే ఛాన్స్ వుంది.. అదే డిసెంబర్ 25 క్రిస్టమస్ కి తండేల్ వచ్చే ఛాన్స్ లేదు, అప్పటికి రెడీ అవ్వదు అంటూ చందు మొండేటి తండేల్ రిలీజ్ తన చేతుల్లో లేదు నిర్మాత అరవింద్, హీరో చైతుల్లోనే ఉంది అని చెప్పకనే చెప్పేసాడు.