దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 10 న ఆడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ స్టార్ వేట్టయ్యన్ మూవీ ని దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించాడు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ లో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన వేట్టయ్యన్ ని తమిళ ప్రేక్షకులు ఆదరించినా తెలుగు ప్రేక్షకులు మాత్రం సూపర్ స్టార్ వేట్టయ్యన్ ను పెద్దగా పట్టించుకోలేదు.
సోషల్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అయితే ఇప్పుడు వేట్టయ్యన్ ఓటీటీ రిలీజ్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో చాలా ఆత్రుత నెలకొంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్నారు.
తాజాగా వేట్టయ్యన్ ఓటీటీ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అయ్యింది. రజినీకాంత్ వేట్టయ్యన్ చిత్రాన్ని నవంబర్ 7 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి తెచ్చేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. సో అమెజాన్ ప్రైమ్ వారు వేట్టయ్యన్ ను నవంబర్ 7 న ఓటీటీ ఆడియన్స్ ముందుకు తెచ్చే అవకాశం ఉంది.