Advertisementt

ప్రభాస్ స్పిరిట్ పై హైప్ ఇచ్చే అప్ డేట్

Sun 03rd Nov 2024 10:53 AM
spirit  ప్రభాస్ స్పిరిట్ పై హైప్ ఇచ్చే అప్ డేట్
Crazy update on Prabhas Spirit ప్రభాస్ స్పిరిట్ పై హైప్ ఇచ్చే అప్ డేట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ తో పాటుగా హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ ఈ రెండు చిత్రాలతో పాటుగా సందీప్ వంగతో చెయ్యబోయే స్పిరిట్ మూవీని కూడా మొదలు పెట్టాల్సిఉంది. జనవరి నుంచి స్పిరిట్ ని సెట్స్ మీదకి తెలుసుకెళ్లే ఏర్పాట్లలో సందీప్ వంగ ఉన్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తారని సందీప్ వంగ ఎప్పుడో రివీల్ చేసారు. తాజాగా స్పిరిట్ లో పోలీస్ గా కనిపించబోయే ప్రభాస్ కథలో మలుపులు కారణంగా గ్యాంగ్ స్టర్ గా అవతారమెత్తుతాడని.. దానిలో భాగంగానే భారీ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

దాదాపుగా 400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న స్పిరిట్ కోసం భారీ సెట్స్ ను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సెట్ వేస్తున్నట్లుగా సమాచారం. ప్రభాస్ ని పెట్టుకుని ఒరిజినల్ లొకేషన్స్ లో షూటింగ్ చెయ్యడం కష్టం కాబట్టే సందీప్ వంగ సెట్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.  

Crazy update on Prabhas Spirit:

Spirit new update 

Tags:   SPIRIT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ