Advertisementt

100 కోట్ల సినిమాని వదిలేసారేందుకో..

Mon 04th Nov 2024 05:24 PM
amaran  100 కోట్ల సినిమాని వదిలేసారేందుకో..
Why did you leave the 100 crore film.. 100 కోట్ల సినిమాని వదిలేసారేందుకో..
Advertisement
Ads by CJ

అమరన్ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ఓటీటీ సినిమా, మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ అందరికి తెలిసిందే, దర్శకుడు ఎలా తీసినా దీనిని థియేటర్స్ లో చూడరని అనుకున్నారు చాలామంది ప్రేక్షకులు. కానీ సినిమా విడుదలయ్యాక దాని ఓపెనింగ్స్ చూసి అందరూ షాకయ్యారు. 

సాయి పల్లవి-శివ కార్తికేయన్ కాంబోలో రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన అమరన్ మూవీ దీపావళి స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలై ప్రతి భాషలోనూ సినిమాకు హిట్ టాక్, భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం మూడు రోజుల్లోనే శివ కార్తికేయన్ సినిమా ఏకంగా రూ. 107 కోట్లు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఆశ్చర్యపరిచింది. 

అమరన్ సినిమా విడుదలకు ముందు ఈ చిత్రాన్ని శివ కార్తికేయన్, సాయి పల్లవి ఇంకా టీమ్ తెగ ప్రమోట్ చేసింది. కానీ విడుదలై హిట్ టాక్ వచ్చాక ఎలాంటి ప్రమోషన్స్ లేవు. రజినీకాంత్ అమరన్ చూసి ప్రశంసించడం తప్ప అమరన్ కి సంబందించిన సక్సెస్ సెలబ్రేషన్స్ కానీ ఏవి లేవు. 

మూడు రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టి పరుగులు పెడుతుంది, ఇంకా సినిమాని మరింతగా ప్రమోట్ చేస్తే ఈ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పడం కష్టం. అందుకే 100 కొట్ల సినిమాని వదిలేసారేందుకు అని అనేది. 

Why did you leave the 100 crore film..:

Why did you leave Amaran like that?

Tags:   AMARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ