Advertisementt

మరో హిట్ కోసం వెయిటింగ్ అంటున్న మీనాక్షి

Wed 13th Nov 2024 11:22 AM
meenakshi chaudhary  మరో హిట్ కోసం వెయిటింగ్ అంటున్న మీనాక్షి
Meenakshi is waiting for another hit మరో హిట్ కోసం వెయిటింగ్ అంటున్న మీనాక్షి
Advertisement
Ads by CJ

లక్కీ భాస్కర్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి.. ఆ చిత్రంలో దుల్కర్ భార్య గా అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది, సుమతి పాత్రను అద్భుతంగా పెర్ఫర్మ్ చేసింది. లక్కీ భాస్కర్ సెకండ్ హాఫ్ లో నటనలో దుల్కర్ తో పోటీ పడింది. రెండు వారాల క్రితమే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మీనాక్షి మరో సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. 

రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మట్కా చిత్రంలోనూ మీనాక్షి చౌదరినే హీరోయిన్. ప్రస్తుతం మట్కా టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా వుంది, లక్కీ భాస్కర్ హిట్ తర్వాత మట్కా ప్రమోషన్స్ లో మీనాక్షి మెరుస్తూ కనిపిస్తుంది. ఈ చిత్రంతో కూడా హిట్ కొట్టాలని ఈ భామ ఆశపడుతోంది. 

మట్కా ట్రైలర్, ప్రమోషన్స్ లో టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తే మట్కా కి హిట్ ఛాయలు కనిపిస్తున్నారు. మరి మట్కా కూడా హిట్ అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్లు మీనాక్షి ఖాతాలో పడినట్లే. అన్నట్టు మరో వారం తిరక్కుండానే మెకానిక్ రాకీతో మళ్ళీ ప్రేక్షకులను పలకరించేందుకు మీనాక్షి సిద్ధం.  

Meenakshi is waiting for another hit:

Meenakshi Chaudhary is waiting for Matka result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ