Advertisementt

జగన్ కు శత్రువులెక్కడో ఉండరు..

Thu 14th Nov 2024 12:04 PM
ys sharmila  జగన్ కు శత్రువులెక్కడో ఉండరు..
Sharmila sensational tweet on Jagan జగన్ కు శత్రువులెక్కడో ఉండరు..
Advertisement
Ads by CJ

అప్పుడెప్పుడో అ..ఆ సినిమాలో రావు రమేష్ అన్నట్టు మనకు శత్రువులెక్కడో ఉండరు.. అక్క, చెల్లి రూపంలో మన చుట్టూనే తిరుగుతుంటారు అన్నట్టుగా జగన్ కు శత్రువు ప్రతి పక్షం కన్నా ఎక్కువగా చెల్లి షర్మిల రూపంలో తయారైంది. ఆస్తుల గొడవను రాజకీయాలకు ముడిపెట్టి జగన్ పై ఒంటికాలు మీద లేచే షర్మిల జగన్ కూర్చున్నా తప్పే, నించున్నా తప్పే అన్న చందాన జగన్ పై విరుచుకుపడుతుంది. జగన్ నిన్న కాంగ్రెస్ ఓటు  కామెంట్స్ పై షర్మిల ఎప్పటిలాగే సోషల్ మీడియా వేదికగా అన్నకు ఇచ్చి పడేసింది. 

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది YCP @YSRCParty అధ్యక్షుడు @ysjagan వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. 

బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, YCP కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. జగన్ మోహన్ రెడ్డి గారికి 38 శాతం వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదు. 

38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ YCP నీ నిజానికి ఒక ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని , అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ".  ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి. 

ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా.. YCP ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు 

@ncbn @PawanKalyan @BJP4Andhra గారి సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండి.. అంటూ షర్మిల చేసిన ట్వీట్ జగన్ పై బాణంలా దూసుకొస్తోంది. 

Sharmila sensational tweet on Jagan:

P PCC Chief YS Sharmila Sensational Tweet on YS Jagan

Tags:   YS SHARMILA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ