Advertisementt

చైతూతో మీనాక్షి లక్కీ ఛాన్స్

Wed 20th Nov 2024 10:06 AM
meenakshi chaudhary  చైతూతో మీనాక్షి లక్కీ ఛాన్స్
Meenakshi Chaudhary to star opposite Naga Chaitanya చైతూతో మీనాక్షి లక్కీ ఛాన్స్
Advertisement
Ads by CJ

లక్కీ భాస్కర్ తో నిజంగానే లక్కీ గర్ల్ గా మారిపోయింది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్ చిత్రంలో గ్లామర్ కి దూరంగా నటనకు దగ్గరగా ఉన్న సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయిది. సుమతి కేరెక్టర్ కి లేడీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మట్కా తో నిరాశ పరిచే సినిమాతో ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. 

రేపు శుక్రవారం మెకానిక్ రాకీ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీనాక్షి చౌదరికి లక్కీ ఛాన్స్ వచ్చింది అనే టాక్ వైరల్ అయ్యింది. అది అక్కినేని హీరో నాగ చైతన్య కి జోడి కట్టే అవకాశం వచ్చింది అని తెలుస్తోంది. తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్న చైతు ఆ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. 

కార్తీ-చైతు కాంబో మూవీ స్క్రిప్టు ప‌నులు దాదాపుగా పూర్త‌య్యాయి. ఈ చిత్రంలో నాగ చైతన్య తో రొమాన్స్ చేసేందుకు పూజ హెగ్డే రెడీ, మరో హీరోయిన్ వేటలో కార్తిక్ ఉండగా.. ప్రస్తుతం లక్కీగా ఫామ్ లోకొచ్చిన మీనాక్షి పేరుని చైతూకి జోడిగా పరిశీలిస్తున్నారట. ఈ  చిత్రంలో ఇద్దరి హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని.. అందులో ఒక హీరోయిన్ పూజ, రెండో హీరోయిన్ గా మీనాక్షి ని ఎంపిక చెయ్యబుతున్నారట మేకర్స్. 

Meenakshi Chaudhary to star opposite Naga Chaitanya:

Meenakshi Chaudhary in Naga Chaitanya Next

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ