Advertisementt

పూజ హెగ్డే కి మీనాక్షి చౌదరి చెక్

Thu 21st Nov 2024 10:06 PM
meenakshi chaudhary  పూజ హెగ్డే కి మీనాక్షి చౌదరి చెక్
Meenakshi Chaudhary check to Pooja Hegde పూజ హెగ్డే కి మీనాక్షి చౌదరి చెక్
Advertisement
Ads by CJ

సౌత్ లో పూజ హెగ్డే హవా తగ్గుతుంది అనే సమయంలో ఆమెకి తమిళం నుంచి క్రేజీ స్టార్ హీరోల ఆఫర్స్ వచ్చి పడ్డాయి. అందులో ఒకటి సూర్య చిత్రం, మరొకటి విజయ్ చిత్రం. అలా కోలీవుడ్ లో పూజ హెగ్డే కి అదిరిపోయే ఆఫర్స్ దక్కాయి. దానితో పూజ హెగ్డే టైమ్ స్టార్ట్ అయ్యింది అన్నారు. మరోపక్క నాగ చైతన్యతో మరోసారి తెలుగులో జోడి కట్టే అవకాశం వచ్చింది. 

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న మూవీలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా అనుకున్నారు. ఇంతలోపులో ఆ ప్రాజెక్ట్ లోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. దానితో అందరూ పూజ హెగ్డే మొదటి హీరోయిన్, మీనాక్షి రెండో హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. 

తాజా సమాచారం ప్రకారం పూజ హెగ్డే కన్నా మీనాక్షి చౌదరికి ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే పూజ హెగ్డే ని పక్కనపెట్టి కార్తీక్-చైతు ల ప్రాజెక్ట్ లోకి మీనాక్షి చౌదరిని తీసుకొస్తున్నారనే వార్త సెన్సేషన్ అయ్యింది. ఈ లెక్కన మీనాక్షి చౌదరి పూజ హెగ్డే ఆఫర్ కి ఎసరు పెట్టి ఇలా చెక్ పెట్టిందా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. 

Meenakshi Chaudhary check to Pooja Hegde:

Meenakshi Chaudhary Hitting Pooja Hegde Offers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ