ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల అరెస్ట్ లను చాలా సీరియస్ గా తీసుకుంది, ప్రభుత్వంపైన నోరు పారేసుకుంటున్న వారిపై చర్యలు చేపట్టింది. అంతేకాదు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపై నోరేసుకుని పడిపోవడం కాకుండా అమ్మనా బూతులు తిట్టిన వారిని కూడా అరెస్ట్ చెయ్యాలంటూ టీడీపీ కార్యకర్తలు అభిమానులు గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు.
అందులో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళను కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చెయ్యాలేదనే డిజప్పాయింట్ మోడ్ లో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా కొడాలి, వల్లభనేని వంశీల విషయంలో ఫైర్ అవుతూనే ఉన్నారు.
తాజాగా మరోసారి బుద్ధా వెంకన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వాళ్లను జైల్లో పెట్టాలి.. అదే టీడీపీ కార్యకర్తల కోరిక, అసలు కొడాలి నాని, వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడా..? ఆల్ ఇండియా పిరికిపందల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ అధ్యక్ష, కార్యదర్శులు అంటూ బుద్ధా వెంకన్న కొడాలి, వల్లభనేని వంశీలను మాటలతో ఆడుకున్నారు.