ఈషా రెబ్బ అనగానే మన తెలుగమ్మాయే కదా అంటారు. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈషా రెబ్బ కొన్నాళ్లుగా స్టయిల్ మార్చి గ్లామర్ అవతారం ఎత్తింది. సోషల్ మీడియాలో మోడ్రెన్ లుక్ ఫొటోస్ షేర్ చేస్తూ తనలో ఈ యాంగిల్ కూడా ఉంది అని చెప్పకనే చెబుతుంది.
వరస అవకాశాలు, సినిమా షూటింగ్స్, వెబ్ సీరీస్ లు అంటూ నిమిషం తీరికలేని ఈషా రెబ్బ కి స్టార్ హీరోల అవకాశాలు మాత్రం అందని ద్రాక్షలా మారుతున్నాయి. కెరీర్లో మంచి సక్సెస్ లు ఉన్నాయి, అందానికి అందం, అభినయానికి అభినయం అన్ని ఉన్నాయి. కానీ భారీ అవకాశాలే అల్లంత దూరంలో ఉంటున్నాయి.
ఇక ట్రెడిషనల్ గెటప్ నుంచి చేంజ్ అయితే వర్కౌట్ అవుతుంది అనుకుని గ్లామర్ రోల్స్ కోసం ట్రై చేస్తుంది. కానీ ఆమెకి మాత్రం సాంప్రదాయానికి మరోపేరు అనేలాంటి కేరెక్టర్స్ వస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో తన గ్లామర్ సోకులు ఫొటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈసా రెబ్బ లుక్ చూస్తే ఏమిటి కొత్త అవతార్ అంటారేమో అందరూ..