ఖిలాడీ సినిమా సమయంలో మీనాక్షి చౌదరిని చూసి ఈ అమ్మాయి హీరోయిన్ ఏంట్రా అన్నవారు లక్కీ భాస్కర్ చిత్రంలో సుమతి కేరెక్టర్ లో మీనాక్షి చౌదరిని చూసిన వారు గ్లామర్ కాదురా ముఖ్యం పెరఫార్మెన్స్ ఉండాలి, అది ఈ అమ్మాయిలో పుష్కలంగా ఉంది అంటున్నారు. హిట్ 2లో పేరు తెచ్చుకున్న మీనాక్షి ని గుంటూరు కారం ఇబ్బంది పెట్టింది.
అయినా లక్కీ భాస్కర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మీనాక్షి చౌదరి ఆ చిత్రంలో భార్యగా తల్లిగా డీ గ్లామర్ పాత్ర చేసింది. ఆ పాత్రకు ప్రశంశలు దక్కినా మీనాక్షి చౌదరి మాత్రం ఇంకోసారి లక్కీ భాస్కర్ లో సుమతి లాంటి కేరెక్టర్ చెయ్యకూడదని డిసైడ్ అయ్యిందట. కారణం ఇకపై ఆమెకు అలాంటి అమ్మ, భార్య, అక్క పాత్రాలు ఎక్కడ వస్తాయో అని భయమట.
ఎప్పుడు గ్లామర్ షో కి ఇంపార్టెన్స్ ఇచ్చే మీనాక్షి చౌదరి తాజాగా మెరూన్ కలర్ అవుట్ ఫిట్ లో నాభి అందాలను చూపిస్తూ దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లూజ్ హెయిర్ తో పెద్ద పెద్ద జుంకి లతో మీనాక్షి చౌదరి ని అలా చూస్తే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనాల్సిందే.