హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ కారుకు యాక్సిడెంట్ జరిగిన వార్త ఆయన అభిమానులను కలవరపెట్టింది. రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు తుక్కుగూడ వద్ద మరొక కారుని ఢీ కొట్టింది. రామ్ ప్రసాద్ షూటింగ్ స్పాట్ కి వెళుతుండగా.. ఓటర్ పై తుక్కుగూడ సమీపంలో బ్రేక్ వెయ్యడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రామ్ ప్రసాద్ కారు సడన్ గా బ్రేక్ వెయ్యడంతో వెనుకగా ఉన్న కారు రామ్ ప్రసాద్ కారును ఢీ కొట్టగా.. రామ్ ప్రసాద్ కారు ఎదురుగా ఉన్న కారుని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రామ్ ప్రసాద్ స్వల్ప గాయాలతో బయట పడడం ఆయన అభిమానులను సంతోషపెట్టింది.