Advertisementt

చైతు-శోభిత బ్యూటిఫుల్ మూమెంట్స్

Mon 09th Dec 2024 01:03 PM
sobhita dhulipala  చైతు-శోభిత బ్యూటిఫుల్ మూమెంట్స్
Chaitu-Sobhita Beautiful Moments చైతు-శోభిత బ్యూటిఫుల్ మూమెంట్స్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత ల వివాహం అయ్యి అప్పుడే నాలుగు రోజులైంది. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతు-శోభితల వివాహం ఇరు కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్దతిలో జరిగింది. నాగ చైతన్య-శోభితాలు పెళ్లి బట్టల్లో అత్యంత అద్భుతంగా కనిపించి అభిమానులను సంతోషపెట్టారు. 

అయితే వారి వివాహమైన రోజు నాగార్జున కేవలం కొన్ని ఫొటోస్ ని మాత్రమే షేర్ చేస్తూ వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా శోభిత చైతూతో కలిసి పెళ్లిని ఎంతగా ఎంజాయ్ చేసిందో ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసింది. చైతు తాళి కట్టాక శోభిత ప్రేమగా చైతు బుగ్గలను నిమురుతున్న ఫోటో, అలాగే తలంబ్రాలు పోస్తుంటే శోభిత ఆనందంగా ఆస్వాదిస్తున్న పిక్స్ షేర్ చేసింది. 

జీలకర్ర బెల్లం పెడుతుండగా దిగిన పిక్, నాగ చైతన్య శోభిత తలపై తలంబ్రాలు పోస్తున్న ఫోటో, తన భార్య శోభితకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్న పిక్, శోభితకు తలంబ్రాల చీర పెట్టే సందర్భంలో చైతు ని ప్రేమగా చూసున్న పిక్స్ ని శోభిత షేర్ చెయ్యాగానే వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటూ అక్కినేని అభిమానులే కాదు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. 

Chaitu-Sobhita Beautiful Moments:

Sobhita Dhulipala-Naga Chaitanya Share Heartfelt Moments

Tags:   SOBHITA DHULIPALA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ