నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా రికార్డ్ క్రియేట్ చేసిన నందమూరి బాలకృష్ణ కు మినిస్టర్ పదవి ఇవ్వకుండా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి అది కూడా తమ్ముడికి తప్ప మరెవరికి పరిచయం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల నందమూరి అభిమానులు కినుకు వహిస్తున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు కు ఏపీ క్యాబినెట్ లో మిస్టర్ బెర్త్ కన్ ఫర్మ్ అయ్యింది. ఆయన జనసేన పార్టీలో పవన్ కోసం పని చేసారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అయినప్పటికీ ఆయనకి మంత్రి పదవి వచ్చేసింది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించను అన్న పవన్ ఆయన అన్న ని క్యాబినెట్ లోకి తీసుకురావడంపై కూడా పవన్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇక టీడీపీ అభిమానులైతే
దేవినేని ఉమ
నందమూరి బాలకృష్ణ
ధూళిపాళ నరేంద్ర
చింతమనేని ప్రభాకర్
పరిటాల శ్రీరామ్
జేసీ.. వీళ్ళలో లేనిది ఆయనలో ఉన్నది ఎంటో,
బుచ్చయ్య గారు 6 సార్లు ఎంఎల్ఏ
నరేంద్ర గారు 6సార్లు
గద్దె రామ్మహన్ గారు 4 సార్లు +1 ఎంపీ
యరపతినేని గారు 4సార్లు
వెలగపూడి రామకృష్ణ 4సార్లు
అందరూ పార్టీ కష్టకాలంలో నిలబడ్డ వాళ్ళే
వీళ్ళకు లేకుండా నాగబాబు కు మినిస్టరి ఏమిటో అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం డీప్ గా హార్ట్ అవుతున్నారు.