సౌత్ అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ ముంబై లోనే సెటిల్ అయ్యింది. అక్కడ వచ్చే ఒకటి అర సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ కి హిందీలో ఆమెకి బ్రేకిచ్చిన ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు, సీనియర్ హీరోలతో సర్దుకుపోతున్న రకుల్ ప్రీత్ ఈ ఏడాది బాలీవుడ్ నిర్మాత మరియు నటుడు జాకీ భగ్నానీ ని గోవాలో వివాహం చేసుకుంది.
అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే రకుల్ ప్రీత్ కి పెద్దగా సినిమాలు లేవు అనుకునేవారు చాలామందే ఉన్నారు. తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న మూడు బాలీవుడ్ మూవీస్ వచ్చే ఏడాది విడుదలవుతాయి అంటూ క్రేజీ గా ఇచ్చిన అప్ డేట్ అభిమానులను ఎగ్జైట్ అయ్యేలా చేసింది. ఇక ఫ్రెండ్ ని పెళ్లాడడం వలన పెళ్లి తర్వాత తన లైఫ్ లో కొత్తగా మార్పేమీ రాలేదు అని చెప్పిన రకుల్ బరువు తగ్గడం, అలాగే జిమ్ లొ గాయపడిన విషయం పై కూడా స్పందించింది.
ప్రసుతం గాయం నుంచి తాను కోలుకుంటున్నాను అని, తనలాగా శరీరం మాట వినకుండా వర్కౌట్స్ చేయవద్దు, నేను జిమ్ లో గాయపడి రెండు వారాల్లో కోలుకుంటాను అనుకున్నాను, కానీ ఎనిమిది వారాలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. వెన్ను గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను, అందుకే పెద్దగా వర్కౌట్స్ చెయ్యడంలేదు, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను అంటూ రకుల్ తాను నటిస్తున్న సినిమాలపై అప్డేట్ ఇచ్చింది.