ఐదేళ్ల ప్రేమ, నాలుగేళ్ళ పెళ్లి బంధాన్ని విడాకులతో ముగించేసిన నాగ చైతన్య-సమంతలలో ముందుగా నాగ చైతన్య చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అయ్యి హీరోయిన్ శోభిత దూళిపాళ్లను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం విడాకుల పెయిన్ తో పాటుగా మాయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకుని తన కెరీర్ లో బిజీగా ఉంది.
ఆమె విషయంలో ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నా ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ని మైంటైన్ చేస్తున్న సమంత రెండో పెళ్లిపై రకరకాలుగా స్పందిస్తుంది. ఒకసారి నేను సింగిల్ అయినా ప్రస్తుతం హ్యాపీ గా ఉన్నా అంటుంది. మరొకసారి రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమి లేదంటుంది.
తాజాగా సమంత మరోసారి రెండో పెళ్లిపై ఇండైరెక్ట్ ట్వీట్ పెట్టింది. ఆమె జాతకాలకు సంబంధించి కన్య, మకర, మిథునం రాశులకు సంబంధించి కొన్ని రాశి ఫలాలు పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. 2025 లో సమంత నుంచి వచ్చేది.. 2025 ఏడాది చాలా బిజీగా ఉండే సంవత్సరం. నీ వృత్తిలో ముందుకు వెళ్లడమే కాదు బోలెడంత సంపాదించవచ్చు. చాలా నమ్మకమైన ప్రేమించే పార్ట్నర్.
ఫ్యూచర్ లో పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడం. తల్లి లేదా తండ్రి అయ్యే అవకాశం అంటూ సమంత చేసిన పోస్ట్ పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంత నమ్మకమైన పార్ట్నర్ గురించి మాట్లాడుతుంది అంటే ఆమె రెండో పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటూ అందరూ మాట్లాడుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.