Advertisementt

నిఖిల్ కోసం గౌతమ్ కి అన్యాయం చేస్తున్నారు

Wed 11th Dec 2024 02:35 PM
bigg boss  నిఖిల్ కోసం గౌతమ్ కి అన్యాయం చేస్తున్నారు
Bigg Boss 8: Gautham Vs Nikhil నిఖిల్ కోసం గౌతమ్ కి అన్యాయం చేస్తున్నారు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బుల్లితెర నటులు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ 8 విన్నర్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. దాని కోసం సోషల్ మీడియాలో మీటింగ్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో అంతగా మెచ్యూరిటీ లేని గౌతమ్ కృష్ణ సీజన్ 8 లో చాలా మెచ్యూరిటీ సంపాదించుకున్నాడు. అలాగే సెటిల్డ్ గా గేమ్ ఆడుతున్నాడంటూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు.

నిఖిల్ ని విన్నర్ ని చెయ్యడానికి నాగార్జున, బిగ్ బాస్ డిసైడ్ అయ్యారు, నిఖిల్ టాస్క్ ల పరంగా ఓకె కానీ.. గౌతమ్ కి ఉన్న క్రేజ్ ముందు నిఖిల్ సరిపోడు, బయట గౌతమ్ విన్నర్ అవ్వాలని బలంగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ నిఖిల్ నే బిగ్ బాస్ విన్నర్ అవుతాడు, గౌతమ్ ని విన్నర్ చెయ్యరు అంటూ బిగ్ బాస్ సీజన్ 6  రన్నరప్  అఖిల్ సార్ధక్ మట్లాడడం షాకిచ్చింది.

నాగార్జున నిజంగానే కావాలని గౌతమ్ తప్పులను ఎత్తి చూపుతూ నిఖిల్ ని హైలెట్ చేస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రేక్షకులు హోస్ట్ నాగార్జున ని ట్రోల్ చేస్తున్నారు. గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ కాబట్టి విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు అనికొందరు, కాదు కావాలనే గౌతమ్ ని విన్నర్ అని అవనివ్వడం లేదు అని కొందరు మాట్లాడుకుంటున్నారు.  

Bigg Boss 8: Gautham Vs Nikhil:

Who Will Win Bigg Boss 8 Telugu

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ