Advertisementt

అంత పెద్ద సక్సెస్ ని పట్టించుకోని టాలీవుడ్

Wed 11th Dec 2024 09:45 PM
pushpa the rule  అంత పెద్ద సక్సెస్ ని పట్టించుకోని టాలీవుడ్
Tollywood does not care about such a big success అంత పెద్ద సక్సెస్ ని పట్టించుకోని టాలీవుడ్
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ ఇప్పడు పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్న ఓ టాలీవుడ్ మూవీ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పుష్ప ఫీవర్ ఇంకా దిగడం లేదు. అభిమానులే కాదు ఆడియన్స్ కూడా పుష్ప ద రూల్ అంటూ వైరల్ ఫీవర్ తో పిచ్చెక్కిపోతున్నారు. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు పుష్ప ద రూల్ కలెక్షన్స్ రికార్డులు కొల్లగొడుతున్నాయి. 

మొదటి వారం పూర్తి కాకుండానే 1000 కోట్లు కొల్లగొట్టిన పుష్ప ద రూల్ ని టాలీవుడ్ పట్టించుకోకపోవడం విచిత్రమే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా విడుదల కాగానే ట్వీట్లు వేసే టాలీవుడ్ పెద్దలు కానీ, నిన్న సైలెంట్ గా పుష్ప 2 ని వీక్షించిన రాజమౌళి కానీ పుష్ప 2 చిత్రం పై స్పందించకపోవడం చాలా విచిత్రమే అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

టాలీవుడ్ చిత్రం పాన్ ఇండియా లో దున్నేస్తుంటే టాలీవుడ్ ప్రముఖులెవరూ స్పందించకపోవడం ఏమిటో, ఈగో నా, లేదంటే వారు ఇంకా పుష్ప 2 చూడలేదా అనే విషయంలో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేవర అప్పుడు ఇదే సైలెన్స్ ని మైంటైన్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు పుష్ప ద రూల్ విషయంలోను సైలెన్స్ మైంటైన్ చెయ్యడం నిజంగా షాకిచ్చే విషయమే. 

Tollywood does not care about such a big success:

Tollywood silence Pushpa The Rule success

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ