ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తన సెకండ్ ప్రాజెక్ట్ నే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సెట్ చేసుకుని బౌండ్ స్క్రిప్ట్ తో RC16 ని రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లిపోయారు. మైసూర్ నుంచి RC16 రెగ్యులర్ షూట్ మొదలైంది. మొదటి షెడ్యూల్ లోనే రామ్ చరణ్ పాల్గొన్నారు. తాజాగా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది.
ప్రస్తుతం RC16 షూటింగ్ జూబ్లీ హిల్స్ లోని బూత్ బంగ్లా వద్ద జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో బుచ్చిబాబు క్రికెట్ మాచ్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తుండగా.. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ కు విలన్ గా కనిపించబోతున్నారు.
అదే కాకుండా బుచ్చిబాబు బాలీవుడ్ నుంచి పేరున్న నటులను RC16 ఎంపిక చేశారనే వార్త మెగా ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.ఇక హైదరాబాద్ RC16 షెడ్యుల్ ముగియగానే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది.